ఫ్యూచర్‌లో మంత్రి ఉత్త‌మ్ సీఎం అవుతారు : రాజ‌గోపాల్ రెడ్డి

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫ్యూచర్‌లో తప్పనిసరిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.

mla raj gopal reddy
X

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫ్యూచర్‌లో తప్పనిసరిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తన నాలుక‌పై పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయ‌ని, తాను చెప్పింది త‌ప్ప‌క అవుతుంద‌న్నారు. భువ‌న‌గిరి పార్ల‌మెంట్ ప‌రిధిలో నీటి పారుద‌ల పనుల‌పై భువ‌న‌గిరిలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. నల్గగొండ ప్రజల ఆశ్వీర్వాదంతో మంత్రి అయిన ఉత్తమ్ భవిష్యత్తులో సీఎం అవుతారని రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు. ఇక బునాదిగాని పిల్లయిపల్లి ధర్మారెడ్డి కాలువలను రీ డిజైన్ చేయాలని కోరారు. కాలువల వెడల్పు పెంచాలి..

దీని ద్వారా ఆయకట్టు డ‌బుల్ అవుతుంద‌న్నారు. అధికారులు కాగితాలపై కాకుండా దూర‌దృష్టితో ప్రతిపాదనలు పంపాల‌ని ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఆదేశించారు . అయితే గతంలో భువనగిరి సభలో భవిష్యత్తులో మంత్రి కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి తప్పని సరిగా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. ఇంతల్లోనే తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సీఎం అవుతార‌ని అనడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయా అంశంగా మారింది.ఈ స‌మావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్ర‌భుత్వ‌ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెల్, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story