ఖమ్మం రైతు ఆత్మహత్య ఘటనపై స్పందించిన మంత్రి తుమ్మల

రైతు ఆత్మహత్య ఘటన పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆరా

Farmer
X

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో తన పొలాన్ని వేరొకరు ఆక్రమించుకోవడంతో రైతు పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. తనకు న్యాయం జరగక పోవడంతో చనిపోతున్నానని తన ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి వీడియో ద్వారా తన ఆవేదనను తెలియజేస్తూ రైతు బోజెడ్ల ప్రభాకర్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలాన్ని అక్రమించుకోనున్నారని పలు మార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో… కలత చెందిన ఓ రైతు సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్నడు.

ఈ దారుణ ఘటనపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. విచారణ జరిపి తక్షణమే నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని రెవిన్యూ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు..రైతులు పొలం పంచాయితీల కోసం ఆత్మహత్య లకు పాల్పడవద్దని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు..గ్రామాల్లో పొలం పంచాయితీలపై ప్రత్యేక దృష్టిపెడుతామనికాంగ్రెస్ పాలనలో రైతులకు న్యాయం జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story