ములుగులో మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి సీతక్క అన్నారు.

Sethakka
X

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మంత్రి సీతక్క ప్రారంభించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ములుగులో నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మొదటి క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

వివిధ రకాల ఆహార పదార్ధాలతో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్‌లలో ఆహారం అమ్మ చేతి వంటలా ఉండాలన్నారు. నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలను పార్రిశాక వేత్తలుగా చూడలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని సీతక్క అన్నారు. వివిధ రకాల ఆహార పదార్ధాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్ లలో ఆహారం అమ్మ చేతి వంటల ఉండాలని, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్లు పి. శ్రీజ, మహేందర్ జి, డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story