ఆషాఢ బోనాల ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష

జులై 7వ తేదీ నుండి జరిగే బోనాల పండుగ ఏర్పాట్లపై శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆషాఢ బోనాల ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
X

ఆషాడమాస బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హరిత ప్లాజాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జులై 8, 9, 10 తేదీల్లో జరిగే అమ్మవారి కల్యాణం, రథోత్సవం, తదితర కార్యక్రమాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

దేవాలయాలు చుట్టుపక్కల సీసీ కెమెరాలు, బారికేడ్ల ఎత్తు తగ్గించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. బోనాల పండుగ కోసం రూ. 25 కోట్లు నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని వివరించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంత్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story