హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం

హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి ఆగ్రహం
X

హైదరాబాద్ హరిత తారామతి బారదారి రిసార్ట్ లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంట్రెన్స్ దగ్గర గుంతలు పడ్డాయని వెంటనే వాడి మరమ్మతులు చేపట్టాలని, చెత్త చెదారాన్ని తొలగించాలని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంత మంది ఉన్నారు?, వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా? అని ఆరా తీశారు. హరిత రిసార్ట్ నిర్వహణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తారామతి బారదారి ప్రైమ్ లొకేషన్ లో విశాలమైన స్థలంలో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదాన్నారు.

దీనికి నిర్వహణలోపమే ప్రధాన కారణమని. వివిధ స్థాయిల్లో సరైన నిర్ణయాలు తీసుకొని కారణంగా పర్యాటక శాఖ పరిధిలోని హరిత హోటల్స్ నిర్వహణ లోపభూష్టంగా తయారైందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా పర్యాటక, ఎక్సైజ్ , సాంస్కృతిక శాఖలపై సమీక్షలు చేయలేకపోయమని. ఇప్పటినుంచి ప్రతీ నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు .ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ నాయుడు, జీఎం (ప్రాజెక్ట్స్) ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story