'మీడియా' కంట్రోల్‌ మాస్టర్‌ మైండ్‌

ఒడిషా వాసికి ప్రభుత్వంలో కీలక పదవి

మీడియా కంట్రోల్‌ మాస్టర్‌ మైండ్‌
X

తెలంగాణలో మీడియా మేనేజ్‌మెంట్‌తో పాటు కంట్రోల్‌ చేయడానికి రేవంత్‌ ప్రభుత్వం ఓ మాస్టర్‌ మైండ్‌కు కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్ర మీడియా, కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌గా శ్రీరాం కర్రిని ప్రభుత్వం నియమించింది. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఈ మేరకు ఐ అండ్‌ పీఆర్‌ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ సెక్రటరీ హనుమంతరావు ఉత్వర్వులు జారీ చేశారు.సీఎం రేవంత్‌ విదేశీ పర్యటనల వ్యవహారాలన్నీ చూడటానికి అధికారులు, పీఆర్‌వో తదితరులు ఉన్నప్పటికీ డక్కన్‌ క్రానికల్‌ మాజీ రెసిడెంట్‌ ఎడిటర్‌ అయిన శ్రీరాం కర్రి కే మొత్తం బాధ్యతలు ఇతనికే అప్పగించేవారనే టాక్‌ ఉన్నది.

ఆలిండియా సర్వీస్‌లో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన వారిని డీజీపీ, సీఎస్‌గా గత ప్రభుత్వం నియమిస్తే బీహార్‌ వాళ్లకే పెద్ద పీట వేశారని రేవంత్‌ విమర్శించారు. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక తన చుట్టూ పక్కరాష్ట్ర వాళ్లతో పాటు ఒడిషా వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ పెద్దల మనసు దోచుకున్నందుకే ఈ కీలక పదవి ఇచ్చారని, ప్రస్తుత వ్యవస్థ మొత్తం ఒడిషా వ్యక్తి చేతిలోకి వెళ్తుందని సమాచారం.




Raju

Raju

Writer
    Next Story