ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని నాడే చెప్పిన: మందకృష్ణ

ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్‌ 5న చెప్పాను. అధర్మం తాత్కాలికమేనని.. ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పినట్టు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని నాడే చెప్పిన: మందకృష్ణ
X

ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్‌ 5న చెప్పాను. అధర్మం తాత్కాలికమేనని.. ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పినట్టు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీ తీర్పు తర్వాత ఆయన స్పందించారు,

న్యాయం, ధర్మం కోసం 20 ఏళ్లుగా పోరాటం చేసి విజయం సాధించామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉన్నదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్‌ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నది. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఎమ్మార్పీఎస్‌ పోరాడిందన్నారు. 30 ఏళ్ల పోరాటంలో ఎంతోమంది ఎమ్మార్పీఎస్‌ నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎమ్మార్పీఎస్‌ నేతలకు ఈ విజయం అంకితం అన్నారు. అనుకూల తీర్పు ఇచ్చిన జడ్జీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబే అని ఆయన ధన్యవాదాలు చెప్పారు. చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు వచ్చేవి కావు. న్యాయం బతికిందంటే ఆరోజు చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లనే అన్నారు. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందన్నారు.

Raju

Raju

Writer
    Next Story