మూడు నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయలి : మంత్రి పొంగులేటి

ఎల్.ఆర్.ఎస్.పై జిల్లా కలెక్టర్లతో భూపాలపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Srinivas reddy
X

లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్. పై శనివారం నాడు జిల్లా కలెక్టర్ లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసు నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆగస్టు 31 నుండి అక్టోబర్ 31, 2020 వరకు ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను సీకరించింది ఆమోదించింది. ఈ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story