వరంగల్ గిరిజ‌న పిల్ల‌ల‌కు కేటీఆర్ ఆర్థిక చేయూత‌

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ఇద్ద‌రు త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి, అనాథ‌లుగా మారిన ఇద్ద‌రు గిరిజ‌న పిల్ల‌ల‌కు మాజీ ఆర్థిక చేయూత‌ను అందించి గొప్ప మనుసు చాటుకున్నారు.

Peddi sudharshan reddy
X

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ఇద్ద‌రు త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి, అనాథ‌లుగా మారిన ఇద్ద‌రు గిరిజ‌న పిల్ల‌ల‌కు మాజీ ఆర్థిక చేయూత‌ను అందించి గొప్ప మనుసు చాటుకున్నారు.ఇచ్చిన మాట ప్ర‌కారం ఆ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అంద‌జేశారు. వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం 16 చింతలతండా విలేజ్‌లో జులై రెండో వారంలో ఓ ప్రేమోన్మాది.. గిరిజ‌న దంప‌తుల‌పై దాడి చేసి, చంపేశాడు.

ఆ దాడిలో దంప‌తుల ఇద్ద‌రు పిల్ల‌లు దీప‌క‌, మ‌ద‌న్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆ పిల్ల‌ల‌కు తాను అండ‌గా ఉంటాన‌ని, రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేస్తాన‌ని కేటీఆర్ నాడు హామీ ఇచ్చారు. ఆ హామీ మేర‌కు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతుల ద్వారా అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు వారికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ.. దాడి చేసి పిల్లల తల్లిదండ్రుల హత్యకు కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story