రామోజీరావుకు నివాళులర్పించిన కేటీఆర్

రామోజీ రావు మొబైల్ ఎన్‌సైక్లోపీడియా : కేటీఆర్

KTR at Ramoji rao funeral
X

మీడియా దిగ్గ‌జం చెరుకూరి రామోజీరావు పార్థివదేహానికి ఫిల్మ్‌సిటీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలుగు పత్రికారంగం, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడు రామోజీరావు అని కేటీఆర్ అన్నారు. ఆయన మరణం మీడియా రంగంతోపాటు ప్రపంచంలోని తెలుగువారందరికీ తీరని లోటు అని అన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారని పత్రికా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు ప్ర‌జ‌లు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల‌ గురించి గొప్ప‌గా మాట్లాడేవారన్నారు.

రామోజీరావుకు నివాళులర్పించిన కేటీఆర్ఎన్నో సంద‌ర్భాల్లో ఇదే ఫిలిం సిటీలో వారిని క‌లుసుకునే అవ‌కాశం త‌న‌కు ల‌భించింది. మొబైల్ ఎన్‌సైక్లోపీడియా లాగా అన్ని విష‌యాలు చెప్పేవారు. రామోజీ మృతి తెలుగు ప‌త్రికా రంగానికే కాకుండా ప్రపంచంలోని తెలుగు వారంర‌దికీ తీర‌ని లోటు అని పేర్కొన్నారు. యూనివ‌ర్స‌ల్ స్టూడియో స్థాయిలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించాల‌న్న విజ‌న్ రామోజీ రావుకే ఉండే. ఆయ‌న ఆలోచ‌న‌లు, జ్ఞాప‌కాలు త‌ప్ప‌కుండా భ‌విష్య‌త్‌లో అంద‌రికీ స్ఫూర్తినిస్తాయి. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను. ఎప్ప‌టికీ తెలుగు జాతి ఆయ‌న‌ను గుర్తు పెట్టుకుంటుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.ఎమ్మెల్యేలు జ‌గ‌దీశ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నివాళుల‌ర్పించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story