15 ఏళ్ల క్రితం సింగరేణి కార్మికుడి దుస్తుల్లో కేటీఆర్

ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ 15 ఏళ్ల క్రితం దిగిన ఓ రేర్ ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

KTR
X

ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో అరుదైన ఫోటోను పంచుకున్నారు. 15 సంవత్సరాల క్రితం సింగరేణి కార్మికులకు సంఘీభావంగా ఆనాడు నిల్చున్నాను.. వారికి గతంలో కంటే ప్రస్తుతం మా సపోర్ట్ అవసరం’ అని ట్వీట్ చేశారు.

సింగరేణి కార్మికుల దుస్తుల్లో తలకు సేఫ్టీ హెల్మెట్ పెట్టుకుని ఓ చేతిలో టార్చ్, మరో చేతిలో కార్మికుని పనిముట్టు పట్టుకుని ఉన్న ఫొటోను కేటీఆర్ జత చేశారు. అయితే ఇటీవల సింగరేణి బొగ్గు గనుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రాష్ట్రంలోని రేవంత్ సర్కార్‌పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కలిసి సింగరేణిని ఖతం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే బొగ్గు గనులను అమ్మకానికి పెట్టాయని గతంలో కేటీఆర్ అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story