మహిళా కమిషన్‌ ముందు హాజరైన కేటీఆర్‌

హైదరాబాద్‌ బుద్ధభవన్‌లోని మహిళా కమిషన్‌ ముందు హాజరైన కేటీఆర్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

మహిళా కమిషన్‌ ముందు హాజరైన కేటీఆర్‌
X

మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్‌ సుమోటాగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ విచారణకు రావాలని మహిళా కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు మహిళా కమిషన్‌ ముందు కేటీఆర్‌ విచారణకు హాజరయ్యారు.

విచారణ అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. మహిళా కమిషన్‌ ఆదేశం మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాను. నేను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశాను. మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చాను. విచారణకు వస్తే.. మహిళా కాంగ్రెస్‌ నేతలు రాజకీయం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

కేటీఆర్‌ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు వచ్చారు. లోపలికి ఒక్క కేటీఆర్‌ను మాత్రమే పోలీసులు అనుమతించడంతో బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేరేట్లు ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. శాంతియుతంగానే తమ నిరసన తెలియజేశారు. కానీ కాంగ్రెస్‌ మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు కొంతమందితో అక్కడి వచ్చి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనికి ప్రతీగా బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ మహిళా ప్రతినిధులు స్పందిస్తూ రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై, మహిళా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మహిళలకు రూ. 2500 ఎప్పుడు ఇస్తారు? విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు? బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు.దీంతో బుద్ధభవన్‌ వద్ద కొంత ఉద్రిక్తత నెలకొన్నది. మహిళా కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో వివాదం సద్దుమణిగింది.

Raju

Raju

Writer
    Next Story