సుప్రీంకోర్టుకు చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు.. కాసేపట్లో తీర్పు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

సుప్రీంకోర్టుకు చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు.. కాసేపట్లో తీర్పు
X

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ నేతృత్వంలోని ధర్మసనం ముందుకు కవిత పిటిషన్లు వెళ్లనున్నాయి. ఇక సుప్రీం కోర్టుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావాలని బీఆర్ఎస్ మహిళా నేత పావని గౌడ్ సుబ్రమణ్య స్వామికి 108 దీపాలతో పూజలు చేసింది. ‘రాజకీయ కక్షతో అన్యాయంగా జైలులో ఉన్న మా ఆడబిడ్డ కవితక్కకు బెయిల్ రావాలని నా ఇష్టదైవం సుబ్రమణ్య స్వామికి 108 దీపాలతో పూజ చేశాను’. అని ట్వీట్టర్ వేదికన స్వామివారికి పూజ చేసిన వీడియోలు, ఫొటోలు పంచుకుంది.

Vamshi

Vamshi

Writer
    Next Story