గోయెంకాను కలిసిన కేఎల్‌ రాహుల్.. దొరకని భరోసా!

ఐపీఎల్ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాను లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ కలిశాడు. తనను రిటైన్‌ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది.

Kl Rahul
X

ఐపీఎల్ సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాను లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ కలిశాడు. తనను రిటైన్‌ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది. కానీ, అతడిని గ్యారంటీగా రిటైన్‌ చేసుకుంటుందని చెప్పలేమని ఫ్రాంఛైజీ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. ఫ్రాంఛైజీలు మొత్తం ఎంత ఖర్చు పెట్టాలనేది తెలిసిన తర్వాతే ఎంతమందిని రిటైన్‌ చేసుకోవాలనేది ఎల్‌ఎస్‌జీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే లఖ్‌నవూ ఎవరికీ మాట ఇవ్వలేదు. ఒకవేళ రాహుల్‌ను రిటైన్‌ చేసుకున్నా కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం లేదు. బ్యాటర్‌గా జట్టుకు మరింత ఉపయోగపడాలని అతడు కోరుకుంటున్నాడు. మేం నూతన కెప్టెన్‌ కోసం అన్వేషిస్తున్నాం.

కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్‌ కెప్టెన్సీ రేసులో ఉన్నారు’’ అని ఈ ఫ్రాంఛైజీ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడిపోయిన తర్వాత కెప్టెన్‌ రాహుల్‌తో గోయెంకా ఏదో కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌ అయ్యింది. దీంతో రాహుల్‌ జట్టును వీడి వేరే ఫ్రాంఛైజీకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఆశించిన స్థాయిలో కలిసి రాలేదు. పేలవ ప్రదర్శన చేసి కనీసం నాకౌట్‌ దశకు కూడా చేరలేకపోయింది. గతేడాది చెత్త ప్రదర్శనల పరంపరలో ఒకసారి కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా ఫైర్ అయ్యారు

Vamshi

Vamshi

Writer
    Next Story