కేసముద్రం- ఇంటికన్నె రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ

శనివారం కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

కేసముద్రం- ఇంటికన్నె రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ
X

కేసముద్రం- ఇంటికన్నె మధ్య ట్రాక్ ను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. రైల్వే సిబ్బంది గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించింది. రేపటి నుంచి రాకపోకలు కొనసాగే అవకాశం ఉన్నది. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ట్రాక్ మరమ్మతు పనులను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ట్రాక్ మరమ్మతు పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు కేసముద్రం మండలంలోని ఇంటికన్నె-కేసముంద్రం రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ శనివారం రాత్రి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో పలు రైళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలను యథావిధిగా కొనసాగించడానికి రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరమ్మతు పనులు ప్రారంభించారు. రెండు భారీ క్రేన్ల సాయంతో దాదాపు 300 మంది కార్మికులు రాత్రి, పగలు పనిచేసి ట్రాక్‌ను పునరుద్ధరించారు. రేపటి నుంచి రాకపోకలు పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.

Raju

Raju

Writer
    Next Story