ఓమ్నీ వ్యాన్‌ నడిపిన కేసీఆర్‌

ఓమ్నీ వ్యాన్‌ నడిపిన కేసీఆర్‌
X

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తుంటి ఎముక ఆపరేషన్‌ తర్వాత చేతి కర్ర సాయంతోనే చాలా కాలం నడిచారు. ఇటీవలే కర్ర సాయం లేకుండా నడుస్తున్నారు. మ్యానువల్‌ కారు నడిపి చూడండి అని డాక్టర్ల సూచనల మేరకు ఎర్రవల్లిలోని ఫామ్‌ హౌజ్‌లో కేసీఆర్‌ తన పాత ఓమ్నీ వ్యాన్‌ నడిపారు.

గత ఏడాది డిసెంబర్‌ 8న కేసీఆర్‌ జారి పడి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముక ఆపరేషన్‌ జరిగింది. ఆపరేషన్‌ జరిగిన తర్వాత ఆస్పత్రిలోనే వైద్యులు వాకర్‌ సాయంతో కేసీఆర్‌ను నడిపించారు. ఆ తర్వాత కర్ర సాయంతో నడిచిన కేసీఆర్‌ కోలుకున్నారు. కొన్నిరోజులుగా ఏ ఊతం లేకుండానే నడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యానువల్‌ కారు నడపాలనే వైద్యుల సూచనల మేరకు ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్‌ నడిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Raju

Raju

Writer
    Next Story