రామోజీరావు మృతి పట్ల కేసీఆర్ సంతాపం

రామోజీ జీవితం స్ఫూర్తిదాయకం: కేటీఆర్‌

kcr condelenes kcr
X

మీడియా దిగ్గ‌జం చెరుకూరి రామోజీ రావు మృతిపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులను తన ప్రగాడ సానుభూతిని తెలిపారు.స్వయం కృషితో ఎదిగిన గొప్ప దార్శనికుడని చెప్పారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.రామోజీ మృతి పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు సంతాపం తెలిపారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం నేడు అందరికీ ఆదర్శమని చెప్పారు. తెలుగువాడి సత్తాను యావత్‌ ప్రపంచానికి చాటిచెప్పారని వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మ‌ర‌ణం తీవ్ర బాధ‌ను మిగిల్చింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రామోజీ రావు గారు నిజ‌మైన విజన్ ఉన్న వ్య‌క్తి అని ఆయ‌న అన్నారు.

రామోజీరావు మృతి పట్ల కేసీఆర్ సంతాపంరామోజీ మ‌ర‌ణం ప‌ట్ల ఇవాళ త‌న ఎక్స్ అకౌంట్‌లో కేటీఆర్ స్పందించారు. రామోజీరావు స్వ‌యంకృషితో ఎదిగిన వ్య‌క్తి అని, ఆయ‌న జీవితం స్పూర్తిదాయ‌కం అన్నారు.1936, నవంబర్‌ 16న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. చిననాటినుంచే విలక్షణ, సృజనాత్మకత కలిగిన ఆయన.. ఈనాడు దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు. 1974, ఆగస్టు 10న విశాఖపట్టణంలో ఈనాడును ప్రారంభించారు. అనంతరం సితార సినీ పత్రిక, ఈటీవీ చానళ్లను కూడా తీసుకొచ్చి మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫిల్మ్‌ సిటీని నిర్మించారు. సినిమా మొత్తాన్ని అక్కడే షూటింగ్‌ చేసుకునేలా సకల వసతులు కల్పించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story