డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు

పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను హారిస్‌ సాధించినట్లు డెమోక్రటిక్‌ జాతీయ కమిటీ చైర్‌ జేమ్‌ హారిసన్‌ తాజాగా ప్రకటించారు.

డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారయ్యారు. నవంబర్‌ 7న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో ఆమె పోటీ పడబోతున్నారు. పార్టీ అభ్యర్థిత్వం కోసం కావాల్సిన ప్రతినిధుల ఓట్లను హారిస్‌ సాధించినట్లు డెమోక్రటిక్‌ జాతీయ కమిటీ చైర్‌ జేమ్‌ హారిసన్‌ తాజాగా ప్రకటించారు. ఫలితంగా అధ్యక్ష అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనమే.

డెలిగేట్ల ఓట్ల ప్రక్రియ సోమవారం వరకు కొనసాగనున్నది. ఇప్పటికే మెజారిటీ ఓట్లను సాధించినట్లు హారిసన్‌ పేర్కొన్నారు. చికాగోలో ఈ నెలాఖరున జరగనున్న కన్వెన్షన్‌లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కోసం ర్యాలీ చేపట్టి తమ బలం ప్రదర్శిస్తామని హారిసన్‌ తెలిపారు.

పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి డెమోక్రటిక్‌ ప్రతినిధులు ఈ-మెయిల్‌ ద్వారా ఓటు వేశారు. గురువారం ప్రారంభమైన ఈ ఓటింగ్‌ సోమవారం ముగియనున్నది. మరోవైపు తన ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్‌ ఇప్పటివరకు ఎంపిక చేసుకోలేదు. దీనిపై ఈ వారాంతంలో ఆమె నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Raju

Raju

Writer
    Next Story