నలిమెల భాస్కర్‌ కు కాళోజీ సాహితీ పురస్కారం

ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

నలిమెల భాస్కర్‌ కు కాళోజీ సాహితీ పురస్కారం
X

ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు డాక్టర్‌ నలిమెల భాస్కర్‌ కు ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం -2024 ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళోజీ జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు అందజేసి ఘనంగా సత్కరిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నలిమెల భాస్కర్‌.. కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ లెక్చరర్‌ గా వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ఆయనకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ్‌, కన్నడ, మలయాళి, బెంగాలి, అస్సామీ, ఒరియా, గుజరాతి, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో మంచి పట్టుంది. అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. భాస్కర్‌ కు కాళోజీ పురస్కారం ప్రకటించడంపై పలువురు కవులు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story