జీవో 317తో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం : కేబినెట్‌ సబ్‌ కమిటీ

జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.

SUB COMMITE
X

317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యింది. 317 జీవో కింద వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట 30 నుండి 40 శాతం మంది ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు పునరావృత్తం అయినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ గుర్తించింది. 317 జీవోపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవో వెసులుబాటుకు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిం చాలానే ఉద్దేశానికి వ్యతిరేకంగా కొంతమంది ఈ వెసులుబాటును ఉపయోగించుకొని వారి వారి సొంత జిల్లాకు పోవాలనే ప్రయత్నంలో కమిటీ దృష్టికి తెచ్చారు.

ఎవరికైతే 317 జీవో లో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు ,రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, జీఎడీ ముఖ్య కార్యదర్శి మహేష్ కుమార్ ఎక్కా దత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, శివశంకర్ పీఆర్‌సీ చైర్మన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా, ప్రిన్సిపల్ సెక్రెటరీ నదిమ్ , లా సెక్రెటరీ తిరుపతి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన, తదితర వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story