ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తీర్పు రిజర్వ్‌

ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తీర్పు రిజర్వ్‌
X

ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ శాసనసభ సభ పక్షం తరఫున ఫిర్యాదు చేసిందని, వారు స్పందించలేదని తెలిపింది.

దీంతో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఫిర్యాదును స్వీకరించలేదంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్‌ అనర్హత వేటు వేయాల్సి ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదించారు. స్పీకర్‌ నిర్ణయం తీసుకునేలా కోర్టులు ఆదేశించే అధికారం లేదని అడ్వకేట్‌ జనరల్‌ వాదించారు.

Raju

Raju

Writer
    Next Story