లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బెయిల్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్ చేసింది.

Delhi cm
X

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బెయిల్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై ఇవాళ ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సెప్టెంబర్ 10న తీర్పు వాయిదా వేసింది. దీంతో సీఎం మరికొన్ని రోజులు జైల్లోనే ఉండనున్నారు. బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదిస్తూ.. సీబీఐ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎంను అరెస్టు చేయలేదు.

ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్‌ వచ్చిందో.. వెంటనే సీబీఐ ‘ఇన్స్యూరెన్స్‌’ అరెస్టుకు పాల్పడింది. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదు’’ అని కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కామ్‌లో కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు. ఆ గడువు ముగియడంతో జూన్‌ 2న తిరిగి లొంగిపోయారు. కాగా.. ఈ కేసులో జూన్‌ 20న రౌస్‌ అవెన్యూ కోర్టుకేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story