జో బైడెన్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

జో బైడెన్‌కు కొవిడ్‌-19  పాజిటివ్‌ నిర్ధారణ
X

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆయన కోవిడ్‌ బారిన పడినట్టు వైట్‌హౌజ్‌ వెల్లడించింది. స్వల్ప దగ్గు, జలుబుతో జో బైడెన్‌ బాధపడుతున్నారు.ఆయన డెలావేర్‌లో ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తారని వైట్‌హౌజ్‌ ప్రకటనలో తెలిపింది.

కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ఆయన ఇప్పటికే ఖరారైన షెడ్యూల్‌ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్ వెగాస్‌లో ప్రచారంలో ఉండగా కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నట్లు తేలడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు. మరోవైపు లాస్‌ వేగాస్‌లో జరిగే యూనిడోస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడాల్సి ఉన్నది. కొవిడ్‌ కారణంగా బిడెన్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ ప్రకటించారు.బైడెన్‌ టీకాలలతో పాటు బూస్టర్‌ డోసు తీసుకున్నారుని, ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో ఆయన బాధపడుతున్నట్లు ఆమె చెప్పింది.

Raju

Raju

Writer
    Next Story