గురుకుల విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం : భట్టి

జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు.

Bhatti
X

తెలంగాణలో అన్ని గురుకుల పాఠశాలను పక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జగత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులను డిప్యూటీ సీఎం సందర్మించారు. ఇటీవల కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో సర్కారు అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఇవాళ పాఠశాలకు వచ్చిన భట్టి.. పరిసరాల్లో కలిగిదిరుగుతూ పరిశీలించారు. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌ను చూసి మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపించారు. కంటతడి పెట్టుకున్న వారిని డిప్యూటీ సీఎం ఓదార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

తమ పిల్లల పరిస్థితి ఏంటని మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు అడగ్గా.. విచారణ చేపట్టి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు..అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురి అస్వస్థతపై ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల విద్యార్థుల హెల్త్ చెక్ అప్ చేయిస్తున్నారా లేదా అంటూ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌ని ప్రశ్నించారు. గురుకుల పాఠశాలలో వసతులు, సిబ్బంది, డ్యూటీ నర్స్ సంబంధిత అంశాలపై ఆరా తీశారు.

చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆశ్రద్ధ చూపించవద్దని హెచ్చరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..గురుకులంలో ఇద్దరు చిన్నారుల మృతి బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరణించిన విద్యార్ధుల కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రూ. 5 వేల కోట్లతో గురుకులాలకు సొంత భవనాలను నిర్మిస్తామన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story