జీవో నెం.46ను తక్షణమే ఎత్తివేయాలి : రాకేష్‌రెడ్డి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సక్రమంగా నిర్వహించేందుకు జారీ చేసిన జీవో నెం.46పై స్టేను తక్షణమే ఎత్తివేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Rakesh Reddy
X

రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన పడకేసిందని బీఆర్‌ఎస్ నేత ఏనుగల రాకేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియతో మాట్లాడారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు, గురుకుల టీచర్లు, ఆందోళన చేస్తుంటే సీఎంకి సోయి లేకుండా ఉన్నారని రాకేష్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో హత్యలు,హత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవడ లేదని ఆయన విమర్శించారు. జీవో 46 బాధితులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వాలు ఉద్యమాల వల్ల చట్టాలనే వెనక్కు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి...ప్రజా పాలన అని చెబుతున్నసీఎం రేవంత్ ప్రభుత్వం జీవో46 వెనక్కి తీసుకోని సవరణ చేయాలని రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

నేను ఎమ్మెల్సీ గా ఓడిపోవచ్చు..కాని ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో నెం.46 బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాతానని రాకేష్‌రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయనను పోలీసులు సెక్రటేరియట్ లోనికి అనుమతించకపోవడంతో సీఎస్‌కు సమర్పించాలని అనుకున్న వినతి పత్రాన్ని అక్కడే ఉన్న గోడకు అంటించి అక్కడి నుంచి వెనుదిరిగారు.

Vamshi

Vamshi

Writer
    Next Story