జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి : శ్రీనివాస్‌గౌడ్‌

జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Sradar ppanna
X

జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఇవాళ సర్వాయి పాప్నన్న జయంతి సందర్బంగా కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం జిల్లాకు ఆయన పేరు ప్రకటించాలని కోరారు. ట్యాంక్‌బాండ్‌పై బహుజన పోరాటయోధుడి విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతంలో సీఎంగా కేసీఆర్‌ నిర్ణయించారని, మూడు కోట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారని, ఆ మేరకు విగహం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఖిలాషాపూర్‌ను పర్యాటకంగా తీర్చిదిద్దామని, ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రయత్నం చేసినట్టు తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story