మూడు దశల్లో జమ్మూకశ్మీర్ ఎన్నికలు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్ విడుదల చేశారు.

Raj kumar
X

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ విడుదల చేశారు. ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న మొదటి దశ, సెప్టెంబర్ 25న, రెండో దశ ఆక్టోబర్ 1 మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను ఆక్టోబర్ 4న వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ వెల్లడించింది. 2019లో జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేశాక తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి ఇక్కడ ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో 74 జనరల్, ఎస్సీ-7, ఎస్టీ-9. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 87.09 లక్షల మంది (జులై 25 నాటికి) ఓటర్లు ఉంటారు. ఇందులో 44.46 లక్షల మంది పురుషులు కాగా, 42.62 లక్షల మంది మహిళా ఓటర్లు. ఇక 3.71 లక్షల మంది మొదటి సారి ఓటర్లు, 20.7 లక్షల మంది యువ ఓటర్లు’ అని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story