అలాంటి వ్యక్తి హోం మంత్రిగా ఉండటం విచిత్రమే: పవార్‌

అవినీతిపరులందరికీ శరద్‌ పవార్‌ ముఠా నాయకుడు అంటూ అమిత్‌ షా చేసిన ఆరోపణలపై పవార్‌ ఘాటుగా స్పందించాడు.

అలాంటి వ్యక్తి హోం మంత్రిగా ఉండటం విచిత్రమే: పవార్‌
X

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. దేశంలోనే ఆయన అత్యంత అవినీతిపరుడు అంటూ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై శరద్‌ పవార్‌ తీవ్రంగా స్పందించారు. 2010లో సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు షాను సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు గుజరాత్‌ నుంచి బహిష్కరించన విషయాన్ని పవార్‌ ఈ సందర్భంగా గుర్తు చేసి ఆయనపై ధ్వజమెత్తారు.

'ఇటీవల అమిత్‌ షా నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ నేనొక ముఠా నాయకుడినంటూ అబద్ధాలు చెప్పారు. అయితే చట్టాన్ని దుర్వినియోగం చేశానంటూ ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆయనను రెండేళ్ల పాటు గుజరాత్‌ నుంచి బహిష్కరించింది. అలాంటి వ్యక్తి నడు దేశానికి హోం మంత్రిగా కొనసాగటం నిజంగా విచిత్రమే. కనుక దేశం ఎలాంటి వారి చేతిలో ఉన్నదో మనమంతా ఆలోచించుకోవాలి. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో సందేహం లేదంటూ పవార్‌ మండిపడ్డారు.

Raju

Raju

Writer
    Next Story