అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ రూ. 62 వేల కోట్ల అప్పులా?: ఏలేటి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 62 వేల కోట్లు అప్పులు చేయడానికి సిద్ధపడిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ రూ. 62 వేల కోట్ల అప్పులా?: ఏలేటి
X

తెలంగాణ రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబీలో కూరుకుపోయిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 62 వేల కోట్లు అప్పులు చేయడానికి సిద్ధపడిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

రూ. 52 వేల కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో రూ. 62 వేల కోట్ల అప్పులు చేస్తామంటున్నారు. బీఆర్‌ఎస్‌ చేపట్టిన ప్రాజెక్టులపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్‌ సీఎం అయ్యాక ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులలో నాసిరకం పనులపై ఆందోళన చేపడుతామన్న, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Raju

Raju

Writer
    Next Story