ఆ భాష పోలీస్‌శాఖకు, డీజీపీకి అంగీకారమేనా? కేటీఆర్‌

సాధారణ పౌరులపై పోలీసులు వాడుతున్న భాషపై, వారితో వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్‌ డీజీపీని ప్రశ్నించారు.

ఆ భాష పోలీస్‌శాఖకు, డీజీపీకి అంగీకారమేనా? కేటీఆర్‌
X

గండి మైసమ్మ పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద లారీ పార్క్‌ చేసిన ఓ యువకుడిని ట్రాఫిక్‌ పోలీసులు చేయి చేసుకుంటూ.. దుర్బాషలాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణ పౌరుడిపై పోలీస్‌ సిబ్బంది అసభ్యకరమైన భాషలో దుర్భాషలాడడంపై బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహారశైలిపై కేటీఆర్‌ డీజీపీని ప్రశ్నించారు. ఇది పోలీస్ శాఖకు, డీజీపీకి అంగీకారయోగ్యమైన భాషేనా అని నిలదీశారు.

పోలీసులకు ప్రభుత్వాధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ సూచించారు.ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సోషల్‌ మీడియాలో పదుల సంఖ్యలో వీడియోలు వస్తున్నా పోలీసులు స్పందించడం లేదన్నారు. ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డీజీపీకి కేటీఆర్‌ సూచించారు.

స్పందించిన సైబరాబాద్‌ పోలీసులు

లారీ డ్రైవర్‌ను ట్రాఫిక్‌ పోలీసులు దుర్బాషలాడుతూ.. చేయి చేసుకున్న ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో సైబరాబాద్‌ పోలీసులు స్పందించారు. తమ అధికారి ఒకరు అనుచితంగా వ్యవహరించినందుకు విచారం వ్యక్తం చేశారు. జీడీమెట్ల ట్రాఫిక్‌ ఎస్సై యాదగిరిపై బదిలీ వేటు వేశారు. క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

Raju

Raju

Writer
    Next Story