ఇజ్రాయిల్‌ విషయంలో ముస్లిం దేశాల మద్దతు కోరిన ఇరాన్‌

ఇజ్రాయిల్‌ దూకుడు విషయంలో రక్షించుకునే చర్యల్లో భాగంగా ముస్లిం దేశాలు తమకు అండగా నిలబడాలని ఇరాన్‌ కోరింది.

ఇజ్రాయిల్‌ విషయంలో ముస్లిం దేశాల మద్దతు కోరిన ఇరాన్‌
X

ఇజ్రాయిల్‌ దూకుడు విషయంలో రక్షించుకునే చర్యల్లో భాగంగా ముస్లిం దేశాలు తమకు అండగా నిలబడాలని ఇరాన్‌ కోరింది. సౌదీ అరేబియా జెడ్డాలో జరిగిన ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ) అత్యవసర సమావేశంలో ఇరాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు.హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియా హత్య నేపథ్యంలో ఇరాన్‌ వినతిపై ఓఐసీ సమావేశమైంది. హనియా పాశ్చాత్య దేశాలు ఖండించలేదని ప్రాంతీయ స్థిరత్వంపై వాటికి ఆసక్తి లేదని ఇరాన్‌ తాత్కాలిక విదేశాంగ శాఖమంత్రి అలీ బఘెరీ కని ఆరోపించారు.

హనియా హత్య విషయంలో ఇజ్రాయిల్‌, అమెరికా పాత్ర ఉందని ఇరాన్‌ ఆరోపిస్తున్నది. దానికి ప్రతీగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ ను శిక్షించాల్సిన సమయం వచ్చిందన్నది. ఈ నేపథ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఈ అర్ధరాత్రి నుంచి నాలుగు గంటల వరకు ఇరాన్‌ గగనతలంలోకి వెళ్లవద్దని ఈజిప్ట్‌ తమ విమానాయాన సంస్థలను ఆదేశించింది. మరోవైపు ఉత్తర ఇజ్రాయిల్‌లో ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి దాడులకు కారకుడైన హెజ్‌బొల్లా కమాండర్‌ బుధవారం దక్షిణ లెబనాన్ లో డ్రోన్‌ దాడుల్లో మృతి చెందాడు. హెజ్‌బొల్లా స్థావరాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరిగాయి. ప్రస్తుత ఘర్షణలు మరింత పెంచాలని చూస్తే హెజ్‌బొల్లా మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయిల్‌ హెచ్చరించింది.

Raju

Raju

Writer
    Next Story