కేంద్ర బడ్జెట్‌కు ముందు మదుపర్ల అప్రమత్తత

కేంద్ర బడ్జెట్‌కు ముందు మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాల్లో నష్టాల్లో ముగిశాయి.

కేంద్ర బడ్జెట్‌కు ముందు మదుపర్ల అప్రమత్తత
X

కేంద్ర బడ్జెట్‌కు ముందు మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాల్లో నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడం ప్రతికూల ప్రభావం చూపెట్టింది.

సెన్సెక్స్‌ ఉదయం 80,408,90 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఒక దశలో మాత్రం 80,800.92 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌ అమ్మకాలతో మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. చివరికి 102.57 పాయింట్ల నష్టంతో 80,502.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 21.65 పాయింట్లు తగ్గి 24,509.25 వద్ద స్థిరపడింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 4పైసలు పెరిగి 83.66 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 82.53 డాలర్ల వద్ద స్తబ్దుగా ట్రేడవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story