బంగ్లాపై భారత్ ఘన విజయం.. ఆసియా క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా

శ్రీలంక వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ సైమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఉమెన్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Women cricket
X

మహిళ ఆసియా కప్ సైమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఉమెన్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 81 పరుగుల లక్ష్యాన్ని 11 ఓవర్లలోనే ఛేదించింది. ఆసియా క‌ప్‌లో జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తున్న భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత పేస‌ర్ రేణుకా సింగ్‌(3/10), రాధా యాద‌వ్‌(3/14)లు ప్ర‌త్య‌ర్థిని స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌గా.. అనంత‌రం ఓపెన‌ర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), ష‌ఫాలీ వ‌ర్మ‌( 26 నాటౌట్‌)లు చిత‌క్కొట్టారు. 11వ ఓవ‌ర్లో మంధాన హ్యాట్రిక్ ఫోర్లు బాదింది.

దాంతో, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ బృందం 10 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది. త‌ద్వారా ఏడుసార్లు చాంపియ‌న్ అయిన టీమిండియా మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.ఆసియా క‌ప్‌లో ఎనిమిదో టైటిల్‌కు మ‌రింత చేరువైంది. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇవాళ రాత్రి శ్రీలంక-పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఎల్లుండి భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. సంచ‌ల‌న స్పెల్‌తో ఆక‌ట్టుకున్న రేణుకా సింగ్‌కు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ద‌క్కింది.ఆదివారం జ‌రుగ‌బోయే టైటిల్ పోరులో రెండో సెమీఫైన‌ల్ విజేత‌తో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది.

Vamshi

Vamshi

Writer
    Next Story