భారత న్యాయవ్యవస్థపై గౌరవం ఉన్నది: సీఎం రేవంత్‌

భారత న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కవిత బెయిల్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నానని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

భారత న్యాయవ్యవస్థపై గౌరవం ఉన్నది: సీఎం రేవంత్‌
X

భారత న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. 'ఆగస్టు 29న కొన్ని మీడియా వేదికల్లో నేను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు .. కోర్టులను ప్రశ్నిస్తున్నాననే అర్థంలో ధ్వనించాయి. నేను చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా కథనాలు వచ్చాయి. కవిత బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టించారని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను... ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనది భావిస్తూనే ఉంటానని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటనలు చేస్తే కొందరిలో అవి కచ్చితంగా అనుమానాలు రేకెత్తిస్తాయి. కవితకు బెయిల్‌ మంజూరుపై మాట్లాడటమంటే కోర్టుపై వ్యాఖ్యలు చేయడమే. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించేవారు ఇలా మాట్లాడుతారా? రాజకీయ పార్టీల ఆరోపణల్లోకి కోర్టులను ఎందుకు లాగుతున్నారు? ఒకవేళ దేశంలోని అత్యున్నత న్యాయస్థానంపైనే మీకు గౌరవం లేకుంటే సీఎం ప్రవర్తన ఇలాగే ఉంటే ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రంలో ఎదుర్కొ మనండి అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ సీరియస్‌ అయ్యారు.

Raju

Raju

Writer
    Next Story