మూడురోజుల నష్టాల తర్వాత లాభాల్లోకి సూచీలు

మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బుధవారం బలంగా పుంజుకున్నాయి.

మూడురోజుల నష్టాల తర్వాత లాభాల్లోకి సూచీలు
X

మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బుధవారం బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో లోహ, ఐటీ, చమురు షేర్లకు దిగువ స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది.సూచీలు పుంజుకోవడంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ. 8.97 లక్షల కోట్లు పెరిగి రూ. 448 లక్షల కోట్ల (5.34 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 79,565.40 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 79,639.20 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 874.94 పాయింట్ల లాభంతో 79,48401 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 304.95 పాయింట్లు పెరిగి 24,297.50 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 83.95 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 1.12 శాతం లాభంతో 77.34 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story