కొత్త శిఖరాలపై సూచీలు

సూచీలు వరుసగా నాలుగో రోజూ రికార్డు ప్రయాణమే కొనసాగించాయి

కొత్త శిఖరాలపై సూచీలు
X

వరుసగా నాలుగోరోజు సూచీలు దూసుకెళ్లాయి. లోహ, విద్యుత్‌, కొన్ని వాహన రంగ షేర్ల కొనుగోళ్లతో కళకళలాడాయి. బుదవారం సెన్సెక్స్‌ 295.94 పాయింట్లు లాభపడి 81,741.34 వద్ద ముగిసింది. నిఫ్టీ కీలకమైన 24,951.15 పాయింట్ల స్థాయి ఎగువన ముగిసింది.

మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ గత 4 ట్రేడింగ్‌ రోజుల్లో రూ.5.45 లక్షల కోట్లు పెరిగి, జీవనకాల గరిష్ఠమైన రూ. 462.38 లక్షల కోట్ల (5.52 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది

డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి 83.72 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 1.88 శాతం లాభంతో 80.51 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story