నష్టాలతో ముగిసిన సూచీలు

బడ్జెట్‌ నేపథ్యంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి.

నష్టాలతో ముగిసిన సూచీలు
X

బడ్జెట్‌ నేపథ్యంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1500 పాయింట్ల మేర ఊగిసలాడింది. ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీల లావాదేవీ పన్ను పెంచడంతో పాటు, మూలధన లాభాలపై పన్ను పెంచాలని ప్రతిపాదించడం మదుపర్లను నిరాశపరిచింది. అయితే ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు రాణించడంతో సూచీలు మళ్లీ కోలుకున్నాయి.

సెన్సెక్స్‌ ఉదయం 80,724.30 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం 80,766.41 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరిన సూచీ బడ్జెట్‌ ప్రారంభమయ్యే సమయానికి స్తబ్దుగా మారింది. బడ్జెట్‌ ప్రసంగం పూర్తయ్యాక అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ నష్టాల్లోకి చేరింది. ఒకదశలో 1278 పాయింట్లు కోల్పోయి 79,224.32 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. మళ్లీ కోలుకున్న సూచీ చివరికి 73.04 పాయింట్ల నష్టంతో 80,429.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 30.20 పాయింట్లు తగ్గి 24,479.05 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి, 83.69 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.25 శాతం పెరిగి 82.63 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story