ఐదో రోజూ నష్టాల్లోనే సూచీలు

లోహ, బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా ఐదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ఐదో రోజూ నష్టాల్లోనే సూచీలు
X

లోహ, బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా ఐదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. షేర్ల లావాదేవీల రుసుముతో పాటు, స్వల్ప-దీర్ఘకాలిక లాభాలపై పన్ను పెంపు నేపథ్యంలో విదేశీ అమ్మకాలు కొనసాగాయి. చమురు, వాహన షేర్లు రాణించడంతో నష్టాలు తగ్గాయి. సెన్సెక్స్‌ ఉదయం 79,542.11 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో 671 పాయింట్ల నష్టపోయి 79,477.83 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం పుంజుకున్న సెన్సెక్స్‌ 80,039.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 7.40 పాయింట్లు తగ్గి 24,406.10 దగ్గర స్థిరపడింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నిరాశపరిచాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి జీవనకాల కనిష్ఠమైన 83.78 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడి చమురు 1.73 శాతం నష్టతో 80.31 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story