పార్లమెంట్ నిరవధిక వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జున్ 22 నుంచి ఆగస్టు 9 వరుకు సమావేశాలు నిర్వహించారు.

parliament
X

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. జున్ 22 నుంచి ఆగస్టు 9 వరుకు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా నీట్‌ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి.

ఇక ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకూ కొనసాగుతాయని ప్రభుత్వం ముందే ప్రకటించినప్పటికీ ఉభయ సభలు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టాన్ని సవరించే బిల్లు కూడా ప్రవేశపెట్టబడింది. నిబంధనలపై నిరసనలు వ్యక్తం కావడంతో పార్లమెంటు సంయుక్త కమిటీకి సిఫార్సు చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story