మా తండాలో.. మా రాజ్యం కేసీఆర్‌తోనే సాధ్యమైంది : కేటీఆర్

1.51 లక్షల మంది అడవిబిడ్డలకు 4.6 లక్షల పోడు భూములతో పట్టాభిషేకం చేసింది మాజీ సీఎం కేసీఆర్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.

మా తండాలో.. మా రాజ్యం కేసీఆర్‌తోనే సాధ్యమైంది : కేటీఆర్
X

కల్లా కపటం లేనితనం.. ఆత్మీయతల్లో అమ్మగుణం..గిరులనే తమ నివాసాలుగా మలుచుకొని.. ప్రకృతితో మమేకమైన జీవనం గడిపే అడవిబిడ్డలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతర్జాతీయ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొండకోనల్లోని ఆవాసాలకు మిషన్ భగీరథతో స్వచ్ఛమైన జలాలు అందించింది మాజీ సీఎం కేసిఆర్ అన్నారు. 1.51 లక్షల మంది అడవిబిడ్డలకు 4.6 లక్షల పోడు భూములతో పట్టాభిషేకం చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. గిరిపుత్రుల దశాబ్దాల ఆకాంక్ష "మావ నాటే - మావ రాజ్" స్వప్నాన్ని గ్రామ పంచాయితీల ఏర్పాటుతో సాకారం చేసిందని కేసీఆర్ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

పది శాతానికి పెరిగిన రిజర్వేషన్లతో గిరిజన బిడ్డల్లో ఆకాశాన్నంటే ఆత్మవిశ్వాసం నింపింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు. పోడు భూముల గోడును మాత్రమే తీర్చలేదు..పెట్టుబడికి రైతుబంధును అందించడంతో ఆగలేదన్నారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున సగర్వంగా నిర్మించిన ఆత్మగౌరవ భవనాలు గిరిబిడ్డల అస్థిత్వానికి ప్రతీకలు అన్నారు. పదేళ్లలో ప్రారంభించిన గురుకులాలు గిరిజనుల విద్యావికాసానికి వేసిన బలమైన అడుగులు అన్నారు. అడవి బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే సంకల్పం చరిత్రలో చెరగని సంతకం అన్నారు. తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క నుంచి నాగోబా జాతర వరకు చారిత్రక ఉత్సవాలకు అధికారికంగా విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందని తెలిపారు. ఒకటా.. రెండా బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం గిరిజనుల అభ్యున్నతిలో ఓ సువర్ణ అధ్యాయం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story