నేను మళ్లీ సీఎం కావాలంటే టీచర్లు పని చేయాలి : రేవంత్‌రెడ్డి

తాను మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఉపాధ్యాయులు పని చేయాలని సీఎం రేవంత్ అన్నారు

CM Revanth reddy
X

తెలంగాణ ఉద్యమంలో టీచర్ల పాత్ర మరువలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందన్నారు. తెలంగాణలో పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా విద్యుత్ అందిస్తామని సీఎం తెలిపారు.

ప్రతి నెల పస్ట్ తారిఖున జీతాలు అందేలా చూసే బాధ్యత తనదేనని రేవంత్ హామీ ఇచ్చారు.నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను అని సీఎం రేవంత్ అన్నారు. ప్రభుత్వ టీచర్లు చదువు చెబితేనే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. తాను రెండోసారి ముఖ్యమంత్రి కావాలంటే టీచర్లు పని చేయాలని రేవంత్ అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విద్యా వ్యవస్థపై ఫోకస్‌తో వరుసగా మూడుసార్లు గెలిచారని గుర్తు చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story