బీసీ కుల గణన చేయకపోతే మరో సామాజిక ఉద్యమం

మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

బీసీ కుల గణన చేయకపోతే మరో సామాజిక ఉద్యమం
X

బీసీ కుల గణన చేయకపోతే మరో సామాజిక ఉద్యమం మొదలవుతుందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీసీ హిందూ మహ సభ అధ్యక్షుడు బత్చుల సిద్ధేశ్వర్, ఆజాద్ హిందూ ఫెడరేషన్ కన్వీనర్ బక్కని సంజీవ కుమార్, ఇతర నాయకులను అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ తో కలిసి ఆదివారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు బీసీలకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. గత ప్రభుత్వం బీసీల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎత్తివేసిందన్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ ఉద్యమనాయకులు కోల్ జనార్దన్, దాసోజు లలిత, రోజా నేత, కుమార్, అశోక్, బైరు శేఖర్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.

Next Story