ట్రంప్‌ గురించి నాకు బాగా తెలుసు: కమలా హారిస్‌

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తన ప్రచారంలో దూకుడు పెంచారు.తనకు రకరకాల నేరగాళ్ల గురించి తెలుసంటూ ట్రంప్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ట్రంప్‌ గురించి నాకు బాగా తెలుసు: కమలా హారిస్‌
X

అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించి తన మద్దతును హారిస్‌కు తెలిపిన సంగతి తెలిసిందే . తన మద్దతు దారులంతా కమలా హారిస్‌ అండగా నిలవాలని కోరిన అధ్యక్షుడు తన మాజీ ప్రచార కార్యాలయం హెడ్‌ క్వార్టర్స్‌కు ఫోన్‌ చేశారు. అక్కడి సిబ్బందికి ఫోన్‌ చేశారు. అక్కడి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. హారిస్‌ బెస్ట్‌ అంటూ కితాబు ఇచ్చారు.

మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తన ప్రచారంలో దూకుడు పెంచారు. అధ్యక్ష ప్రచార సిబ్బందితో ఆమె మాట్లాడారు. విల్మింగ్టన్‌ హెడ్‌ క్వార్టర్స్‌ తొలి సమావేశంలో మాట్లాడుతూ.. తనకు రకరకాల నేరగాళ్ల గురించి తెలుసంటూ ట్రంప్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

బైడెన్‌ తనకు మద్దతు ప్రకటించిన అనంతరం ఆమె తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా బైడెన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వం సాటిలేదని కొనియాడారు.నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. .హారిస్‌ ఓడించడం చాలా తేలిక అని ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

Raju

Raju

Writer
    Next Story