ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: ప్రభాకర్‌రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు గత నెల జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. ఈ ఉత్తరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: ప్రభాకర్‌రావు
X

రాష్ట్ర ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై లీకులు ఇస్తూ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు సంచలన విషయాలు వెల్లడించినట్టు కొన్ని మీడియాల్లో కథనాలు రాయిస్తున్నది. అయితే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ఈ అసత్య ప్రచారాలను కొట్టి పారేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. ఈ అసత్య ప్రచారాల ద్వారా తాను, తన కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని జూబ్లీహిల్స్ పోలీసులకు గత నెలలో లేఖ రాశారు. అందులో అనేక విషయాలు వెల్లడించారు. అనారోగ్య కారణాల వల్ల అమెరికాలో వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాను. ఈ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు గత నెల 23న జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. ఈ ఉత్తరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో ఇప్పటివరకు తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జూన్‌ 26న నేను భారత్‌కు రావాల్సి ఉన్నదని, కానీ అనారోగ్య కారణాలతో అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని, అమెరికా వైద్యుల సూచనతో ఇక్కడే చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. తనపై అసత్యప్రచారాలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. పోలీస్‌ అధికారిగా నేను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. నేను, నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం.

దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌, మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చేందుకు సిద్ధమన్నారు. తాను క్రమశిక్షణ గల అధికారిని అని, విచారణను ఎదుర్కొంటానని చెప్పారు. తాను ఎక్కడికి తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత భారత్‌కు వస్తానని లేఖలో పేర్కొన్నారు. గతంలోనూ పలుమార్లు ఉన్నతాధికారులకు విషయం చెప్పాను. తన దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణాధికారికి చెబుతాను అన్నారు.

Raju

Raju

Writer
    Next Story