రాంనగర్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆకస్మిక పర్యటన

ముషీరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పర్యటించారు. మణెమ్మ గల్లీలోని నాలాలను ఆక్రమించారని కమిషనర్‌కు ఇటీవల స్థానికులు ఫిర్యాదు చేశారు

Raganth
X

ముషీరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆకస్మికంగా పర్యటించారు. మణెమ్మ గల్లీలో నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఇటీవల స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి రంగనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడారు. గల్లీలో రోడ్డు ఇరుకుగా మారిందని, నాలా.. రోడ్డును ఆక్రమించారని స్థానికులు కంప్లైంట్ చేశారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లలోకి వరదనీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

నాలా ఆక్రమణ, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు, సంబంధిత ఇళ్లు స్థల పత్రాలను పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులను హైడ్రా కమిషనర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌లో వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా రాంనగర్ లాంటి ఇరుకు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లలోకి చేరి గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నాలాలను ఆక్రమించడంతో భారీ వర్షం పడినప్పుడల్లా పరిస్థితి దారుణంగా మారుతోందని స్థానికుల వాపోయారు.

Vamshi

Vamshi

Writer
    Next Story