గ్రేటర్‌ వాసులకు హై అలర్ట్‌.. నిండుకుండల్లా జంట జలాశయాలు

ఇంకో గంటలో ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఓపెన్‌

గ్రేటర్‌ వాసులకు హై అలర్ట్‌.. నిండుకుండల్లా జంట జలాశయాలు
X

జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఉస్మాన్‌ సాగర్‌ (గండిపేట), హిమాయత్‌ సాగర్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ కు చేరుకోవడంతో జల మండలి అధికారులు ఇంకో గంటలో.. అంటే సాయంత్రం 5 గంటలకు రెండు జలాశయాల గేట్లు ఎత్తనున్నారు. ఉస్మాన్‌ సాగర్‌ రెండు గేట్లు ఒక అడుగు మేర, హిమాయత్‌ సాగర్‌ గేట్‌ ఒక అడుగు మేర పైకి ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి వదిలేయనున్నారు. ఉస్మాన్‌ సాగర్‌ నుంచి 226 క్యూసెక్కులు, హిమాయత్‌ సాగర్‌ నుంచి 340 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలేస్తున్నామని, ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అలెర్ట్‌ గా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉస్మాన్‌ సాగర్‌ కు ప్రస్తుతం 1,800 క్యూసెక్కులు, హిమాయత్‌ సాగర్‌ కు 1,400 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుందని తెలిపారు.


ఉస్మాన్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం - 1790.00 అడుగులు

ప్ర‌స్తుత నీటి స్థాయి - 1787.95 అడుగులు

రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం - 3.90 టీఎంసీలు

ప్ర‌స్తుత సామ‌ర్థ్యం - 3.430 టీఎంసీలు


హిమాయ‌త్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం - 1763.50 అడుగులు

ప్ర‌స్తుత నీటి స్థాయి - 1761.10 అడుగులు

రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం - 2.970 టీఎంసీలు

ప్ర‌స్తుత సామ‌ర్థ్యం - 2.455 టీఎంసీలు

Next Story