రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
X

తెలంగాణ రాష్ట్రంలో మూడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 4 నుంచి 11 జిల్లాల్లో భారీ వానలు పడుతాయని పేర్కొన్నది. పలు జిల్లాలకు అరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఇవాళ ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషావైపు కదిలే క్రమంలో మరింత బలోపేతమై వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ వివరించింది.

Raju

Raju

Writer
    Next Story