రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తీవ్ర అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజుల పాటు ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.

రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
X

బంగాళాఖాతంలో తీవ్ర అల్ప పీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ తీవ్ర అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజుల పాటు ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్‌లోనూ నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.కొమురంభీమ్‌ ఆసీఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలను జారీచేసింది.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్నది. ఇదే సమయంలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టానికి ప్రభుత్వం ఆయా విభాగాలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Raju

Raju

Writer
    Next Story