రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
X

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్‌, కొమురంభీమ్‌ ఆసీఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలతో సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడుతాయని తెలిపింది.ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్‌ జోన్‌ ఏర్పడిందని, ఈ ప్రభావంతోనే వానలు పడుతాయని తెలిపింది.

బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనాగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌అలెర్ట్‌ జారీ చేసింది.

Raju

Raju

Writer
    Next Story