ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

జులై 3 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌,హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు
X

ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఢిల్లీలో రెండు రోజులు కురిసిన వర్షాలతో జరిగిన ప్రమాదాల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 11 కు చేరింది. రానున్న వారం రోజుల్లో ఢిల్లీలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్ననేపథ్యంలో మరో మూడు రోజుల పాటు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసినట్టు ఐఎండీ తెలిపింది.

ఢిల్లీలో ఓ వంతెన కింద చిక్కుకున్న బస్సు ప్రయాణికులను సహాయక సిబ్బంది బోట్లు, తాళ్ల ద్వారా రక్షించాయి. హరిద్వార్‌లో ఎండిపోయిన సుఖీ నదిలో కార్లను నిలుపగా ఆకస్మికంగా వరదలు వచ్చి అనేక కార్లు కొట్టుకుపోయాయి. గుజరాత్‌లోని ఇవాళ కురిసిన వానలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. యూపీలోని మొరాదాబాద్‌లో ఓ కాలనీ నీట మునగడంతో స్థానికులు పడవలతో ప్రయాణం చేయాల్సి వస్తున్నది. మధురలో మోకాలు లోతు నీళ్లలో వాహనాలు ప్రయాణం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

జులై 3 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌,హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.

Raju

Raju

Writer
    Next Story